ఇంగ్లిష్ మీడియం ఎడ్యుకేషన్.. మెత్తబడిన జగన్ సర్కారు! తెలుగు మినహా..

ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లిష్ మీడియం ఎడ్యుకేషన్ విషయంలో జగన్ సర్కారు మెత్తబడినట్టు తెలుస్తోంది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు కూడా ఇంగ్లిష్ మీడియం అందించే ఉద్దేశంతో.. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ వచ్చే ఏడాది నుంచి నిర్భంద ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ దిశగా చట్టం చేస్తోంది. అసెంబ్లీలో ఈ బిల్లు ఇప్పటికే ఆమోదం పొందింది. ఏ మీడియంలో చదువుకోవాలనే వెసులుబాటు విద్యార్థులకే ఇవ్వాలని.. సవరణలు సూచిస్తూ బిల్లును మండలి తిప్పి పంపింది.